బోనమెత్తనున్న భాగ్యనగరం

Google+ Pinterest LinkedIn Tumblr +

బోనాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు అనేలా నలుదిశల వ్యాప్తి చేందింది బోనాల పండుగ. భక్తుల కోరికలు కోరుకుంటూ కాపాడాల‌ని వేడుకుంటూ బోనాల పండుగ నిర్వహించడం ఆనవాయితీ మారింది. అయితే కరోనా నేపథ్యంలో గత సంవత్సరం బోనాలు పెద్దగా తీయలేదనే చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం బోనాల ఏర్పాట్లకు సిద్దమైంది.

ఇక తెలంగాణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జులై 11న గోల్కొండ, జులై 25న సికింద్రాబాద్ ఉజ్జ‌యిని బోనాలు ఉంటాయి. వీటి తర్వాత లాల్‌దర్వాజా మ‌హంకాళి బోనాలు ఉండటం విశేషం. హైదరాబాద్ లో బోనాల పండుగ ముగించుకుని పల్లెల్లో బోనాలు నిర్వహిస్తారు. తెలంగాణలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం.

Share.

Comments are closed.

%d bloggers like this: