వెంకీ కుడుమలతో నితిన్ మరోసారి?

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో నితిన్‌, యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్‌ లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ సినిమాలో నితిన్, రష్మిక జంటగా నటించారు. అనుకున్న దానికంటే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఇక మరోసారి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల నితిన్ తో మరోసారి సినిమా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

నితిన్ కు వెంకీ ఓ కథను వినిపించటంతో దానికి నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ నటించిన ‘మాస్ట్రో’ చిత్రం చివరి దశలో ఉంది. దీని తర్వాత పవర్ పేట అనే సినిమా చేయనున్నాడు. ఈ మూవీ అనంతరం నితిన్, వెంకీ కుడుమల ప్రాజెక్ట్ ఉండనుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: