చిరంజీవి కాంగ్రెస్ వాదే- శైలజానాథ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరంటూ గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ చిరంజీవి పార్టీలో కొనసాగటం లేదనే వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని మీడియా, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు.

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ముమ్మాటికి కాంగ్రెస్ వాదేనని తేల్చి చెప్పారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు సేవ చేస్తూ బిజీగా ఉన్నాడంటూ తెలిపారు. దీంతో ఏఐసీసీ కూడా స్పందిస్తూ చిరంజీవి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడంటూ ప్రకటన విడుదల చేసింది. ఇక ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దంటూ హెచ్చరికలు జారి చేసింది ఏపీ కాంగ్రెస్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: