మరో వివాదంలో శశికళ

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ మరో వివాదంలో ఇరుకున్నారు. అన్నాడీఎంకే నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సీవీ షణ్ముగంని శశికళ బెదిరించిందని వార్తలు వస్తున్నాయి. దీంతో సీవీ షణ్ముగం పోలీసులను సంప్రదించాడు.

ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు ఐపీసీలోని 506 (1), 507, 109, ఐటీ చట్టం 2000లోని 67 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. జైలు శిక్ష తరువాత ఇప్పుడు మళ్లీ పార్టీలో మెలగాలని ప్రయత్నాలు చేస్తోంది శశికళ. ఈ మధ్య అన్నాడీఎంకే నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలోకి శశికళ వస్తుందన్న వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: