కరకట్ట పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వీటి నిర్మాణం కోసం ఏపీ సర్కార్ రూ. 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో కరకట్ట పనులను చేపట్టనున్నారు అధికారులు. కరకట్ట రహదారి ద్వారా అమరావతి, హైకోర్టు, సచివాలయం, ఉండవల్లి, ఉద్దండరాయునిపాలెం, మందడం, రాయపూడి, వెంకటపాలెం, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి గ్రామాల వారికి ప్రయాణం మెరుగవనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: