జాకబ్‌ జుమాకు 15నెలల జైలు శిక్ష

Google+ Pinterest LinkedIn Tumblr +

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. ఆయన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పలు మార్లు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకపోవటంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 2009–18 కాలంలో జుమా అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ క్రమంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇక తనకు తానుగా అయిదు రోజుల్లోగా పోలీసులకు సమాచారం ఇవ్వకుంటే జుమాను అరెస్టుకు సిద్దం చేస్తారని తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: