కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు మరో సారి లేఖ రాసింది. వరుసగా లేఖలు రాస్తుండటం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతి లేకుండా నీటిని వినియోగిస్తుందంటూ లేఖలో పేర్కొంది.

శ్రీశైలంలో 17.36 టీఎంసీల నీరు ఉండగా దీంట్లో తెలంగాణ ప్రభుత్వం 6.9 టీఎంసీల నీటిని వినియోగించుకుందని కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాసిన లేఖలో రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తున్న నీటి పట్ల ఏపీ ప్రభుత్వం తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఇదే అంశంపై ఏపీ సీఎం సామరస్యంగా చర్చలు జరపాలని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: