కరోనాతో నష్టపోయిన వాళ్లని ప్రభుత్వం ఆదుకోవాలి-చంద్రబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది నష్టపోయారని, వారికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సాధన దీక్ష పాల్గొన్న ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్ లను పంపారు.

ప్రజలకు మజ్జిగ పోసి జగన్‌రెడ్డి మీగడ తినేస్తున్నారని, ప్రజలకు పదివేలు ఇచ్చి వారి నుంచి ముప్పై వేలు గుంజుతున్నారని వాపోయారు. ఆదాయం పడిపోయిన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే వారికి రూ.5 వేలు ఇవ్వడానికి కూడా మనసు రాలేదు కానీ.. సొంత పత్రికకు ప్రకటనలతో కోట్లకు కోట్లు వెచ్చించటానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందన్నారు. ఈ సాధన దీక్షలో పలువరు టీడీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: