కరోనాపై సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ఆజాగ్రత్త, నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలను బలి తీసుకుందని, ఎప్పటి లాగే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు కార్డియాలజీ సొసైటి ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కే నర్సరాజు. డాక్ట ర్స్ డే ను పురస్కరించుకొని మీడియా తో మాట్లాడిన ఆయన కరోనా పట్ల ఎలాంటి సమస్యలున్నా ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3098 కి కాల్ చేయాలని సూచించారు.

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే వాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని దీనిపట్ల ఎలాంటి అపోహలకు గురికావోద్దు అని అన్నారు. కోవిడ్ సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని తెలిపారు. అనంతరం కరోనాతో పోరాడి మరణించిన డాక్టర్లకు నివాళులు అర్పించి డాక్టర్స్ డే ను వారికి అంకితమిచ్చారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: