రాధేశ్యామ్..చరిత్రలో నిలిచిపోతుందట?

Google+ Pinterest LinkedIn Tumblr +

చరిత్రలో మనం ఎన్నో ప్రేమ కథలను విని ఉంటాం. గొప్ప గొప్ప ప్రేమ కథలు మాత్రం వినటానికి గొప్పగా ఉంటాయి కానీ..కథలో మాత్రం ఓడిపోయిన పాత్రలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రేమ కథల సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టే విధంగా ఉంటాయి.

యాదార్థ ఆధారంగా తెరకెక్కిన ప్రేమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కథలో రక్తికట్టించే సన్నివేశాలు, భావోద్వేగంతో నడిచే సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారుతాయి. గతంలో వచ్చిన తొలి ప్రేమ, సుస్వాగతం, ప్రేమ దేశం, బొంబాయి వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలుసు. ఇక సినిమా కథలో భావోద్వేగంతో నిండి విషాదాన్ని నింపి ప్రేమ కథల చిత్రాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక అలాంటి కథలతో మనముందుకు వస్తున్న మరో చిత్రం రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా భావోద్వేగంతో కూడి విషాదాన్ని నింపే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ కథలో చివర్లో హీరోయిన్ చనిపోతోందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ ప్రేమ కథలో దమ్ము ఎంత అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: