పవర్ స్టార్‌తో బడా నిర్మాత?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాలు పెద్ద హిట్ కావాలంటే కథలో దమ్ము, హీరో నటననే కాకుండా డబ్బులు పెట్టే నిర్మాత పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇక ఈ మధ్య దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో భారీగా వినిపిస్తున్న నిర్మాత సంస్థ పేరు హోంబలే. భారీ బడ్జెట్‌లతో పాన్ ఇండియా సినిమాలు సైతం ఈ సంస్థ ప్రతినిధులు నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా విజయంతో ఈ సంస్థ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో ఈ సంస్థ నిర్మాణాలు చేపడుతుండటంతో ఈ సంస్థ పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. కేజీఎఫ్ సినిమా భారీ హిట్ కావటంతో మళ్లీ కేజీఎఫ్-2 సినిమాను నిర్మిస్తోంది ఈ సంస్థ. ఇది కాకుండా ఈ సంస్థ నిర్మాతలు ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరికొన్ని సినిమాలను లైన్ పెట్టుకుని దూసుకెళ్తోంది ఈ నిర్మాణ సంస్థ. ఇక విషయానికొస్తే కన్నడలో పవర్ స్టార్‌గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హీరోగా కూడా ఓ మూవీని నిర్మించనుందట ఈ సంస్థ. దీంతో భవిష్యత్‌లో హోంబలే నిర్మాణ సంస్థ ఇంకెన్ని నిర్మాణాలు చేస్తుందో చూడాలి మరి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: