జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మల్లు రవి

Google+ Pinterest LinkedIn Tumblr +

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని ఖైదీ నంబర్ 1799 అని ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. ఇలాంటి అర్ధరహిత మాటలు మాట్లాడుతూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలకు మచ్చతెచ్చే పనులు చేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి టీపీసీసీ అధ్యక్షుడయ్యాడని, నేటి సీఎం కేసీఆర్ కూడా గతంలో టీడీపీ పార్టీ నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు మల్లు రవి.

Share.

Comments are closed.

%d bloggers like this: