వైద్యుల సేవలను కొనియాడిన గవర్నర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవ మరిచిపోలేనిదని అన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య వృత్తిలో ఉన్న వారికి గవర్నర్‌ అభినందనలు తెలిపారు. భారతీయ సమాజం వైద్యులను దేవునితో సమానంగా చూస్తున్నారని తెలిపారు.

ప్రపంచ జనాభాకు సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. కరోనా రోగుల ప్రాణాలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్కచేయటం లేదని వారి సేవలను కొనియాడారు గవర్నర్. ఇక జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను అభినందించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: