రూటు మార్చిన టాలీవుడ్ స్టార్ హీరోలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కాస్త రూటు మార్చారనే చెప్పాలి. విభిన్న సినిమాలు చేస్తూ తమ సత్తాను చాటుకోబుతున్నారు మన హీరోలు. గతంలో కమర్షియల్ సినిమాలు, సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్దపడే నటులు ఇప్పుడు వేరే మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది. ఇక దగ్గుపాటి రానా, వెంకటేష్‌, నానీ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నందమూరి కళ్యాణ్‌ రామ్, బాలయ్య వంటి ప్రముఖ నటులు విభిన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

రోటిన్ కథలే కాకుండా కాస్త వెరైటీ కథలను వింటూ వాటికి సైన్ చేస్తున్నారు. దమ్మున్న స్టోరీ లైన్ వింటూ వాటికి ఓకే చెబుతున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు. ఇక కొత్త దారిని ఎంచుకున్న సినిమాల లీస్టును చూసినట్లైతే ఇందులో విరాట పర్వం, పుష్ప, నారప్ప, శ్యామ్‌సింగరాయ్, హరిహర వీరమల్లు, ఆచార్య, అఖండ, బింబిసార వంటి సినిమాలు ఉన్నాయి. విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో కథల తగ్గట్టు వారి గెటప్‌ను కూడా మార్పు చేస్తున్నారు దర్శకులు. ఎప్పుడు రోటిన్ సినిమాలే కాకుండా కొద్దిగా కొత్త కథలకు పచ్చ జెండా ఊపుతున్నారు మన హీరోలు. ఇక ఇలాంటి సినిమాలతో మన హీరోలు ఎలాంటి హిట్ కొడతారో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: