హైకమాండ్ నుంచి పిలుపు..పయనమైన భట్టి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత నేత భట్టి విక్రమార్కకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు అందింది. దీంతో హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఉన్నట్టుండి ఢిల్లీ నుండి పిలుపు రావటంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ టీపీసీసీ ప్రకటన అనంతరం మొదటిసారిగా అధిష్టానం నుంచి పిలుపు రావడమనేది కాస్త ఆలోచించే అంశంగా కనిపిస్తోంది.

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉండటమే కాకుండా కొందరు నేతలు రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో భట్టికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం పార్టీ నేతల్లో కాస్త ఉత్కంఠగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: