ఏపీ వ్యాపారాలను ఏనాడు అడ్డుకోలేదు-శ్రీనివాస్ గౌడ్

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ లో ఏపీ వ్యక్తుల వ్యాపారాలు ఏనాడైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్కుల పేర్లు, కాలనీల పేర్లలను తొలగించలేదని తెలిపారు. ఏపీ ప్రజలను తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిననాటి నుంచి హైదరాబాద్ లో ఏపీ ప్రజలు చాలా మంది ఉంటున్నారని, వెళ్లిపోమని ఏనాడు చెప్పలేదని అన్నారు. ఏపీ, తెలంగాణ బాగుపడాలంటే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నారు శ్రీనివాస్ గౌడ్.

Share.

Comments are closed.

%d bloggers like this: