వి.హనుమంతురావుతో ఫోన్లో మాట్లాడిన సోనియా

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆయనను పరామర్శిస్తున్నారు. ఇటీవల టీపీసీసీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి నేరుగా ఆస్పత్రికి వెళ్లి హనుమంతరావుని పరామర్శించాడు.

తాజాగా సోనియా గాంధీ నేరుగా ఫోన్ చేసి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నామని, మీ అవసరం పార్టీకి ఎంతో అవసరమని తెలిపినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించటంతో హైదర్‌గూడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: