తెరపైకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్?

Google+ Pinterest LinkedIn Tumblr +

చరిత్రపేజీలు తిరగేస్తే కొందరు ప్రముఖ మనుషులుంటారు..సమాజాన్ని ప్రేమించి సేవ చేసినవారు మనుషులను దాటి మహర్షులవుతారు. అలా ఎదిగిన కొందరు ప్రముఖుల జీవితాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు గతంలో పుస్తకాల్లో ముద్రించారు. కానీ ఇప్పడు అలా కాకుండా కాస్త రూట్ మార్చి తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బయోపిక్‌ అనే పదాన్ని జోడిస్తూ వారి జీవితాన్ని సినిమాగా తీస్తున్నారు నేటి దర్శకులు.

ఈ తరుణంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నేతల తీరును తెరపై చూపించేందుకు దర్శక, నిర్మాతలు సరికొత్తగా మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తెలుగు రాజకీయాలను శాసించిన నేతలు పేర్లను వేళ్లమీద మాత్రమే లెక్కబెట్టేయొచ్చు. ఇక ఈ మధ్య టాలీవుడ్‌లో ప్రముఖుల బయోపిక్‌లను తీస్తూ వారి జీవితంలో ఎదిగిన కష్టాలను, వారి విజయగాధలను తెరపై చూపిస్తున్నారు దర్శకులు.

అలా తెరపై కొందరి తెలుగు రాజకీయ నాయకుల నిజ జీవితాలను చూపించారు నేటి డైరెక్టర్స్. వారు ఎదిగిన తీరు తెన్నులు, ఎదుర్కున్న సవాళ్లు, అపజయాలను ప్రేక్షకులకు చూపించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామా రావు, జయలలిత, ఇందిరా గాంధీ వంటి రాజకీయ ఉద్దండుల నిజ జీవితాలను బయోపిక్‌ల రూపంలో తెరపై చూపించారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని కూడా బయోపిక్‌గా తెరకెక్కించేందుకు తెర వెనుక చర్చలు జరుగుతున్నాయట. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్ జగన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారట. ఇక జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, తండ్రి మరణం, జైలుకెళ్లటం, పాదయాత్ర, ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వంటి అంశాలను ఆధారంగా తీసుకుని సినిమా రూపొందిస్తున్నారట. మరి ఇందులో హీరోగా స్కాం 1992 మూవీ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: