శ్రీశైలం డ్యాం వద్ద మోహరించిన పోలీసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకు తారా స్థాయికి ఎగబాకుతోంది. వివాదం కాస్త వేడిని రాజేస్తుండటంతో శ్రీశైలం డ్యాం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినా ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి తయారు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తికి ఏకంగా 4 టీఎంసీల నీరు దిగువకు వెళ్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకోవటంతో అక్కడ తెలంగాణ, ఏపీ పోలీసులు మోహరించారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి సైతం లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: