పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గువ్వల బాలరాజు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిల్లిలో రెండవ రోజు ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన పల్లె ప్రగతిలో గ్రామాల రూపు రేఖలు మారాలని పిలుపునిచ్చారు. ఇక ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: