జలవివాదాలపై రఘురామ జగన్‌కు లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తూ సంచనలంగా మారుతున్నారు. తాజాగా సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు రఘురామ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకుని నీటి వివాదాలను పరిష్కరించాలని లేఖలో తెలిపారు.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలుపుకుంటే సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చన్న జగన్..జలవివాదాలను ఎందుకు పరిష్కరించుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రధానికి లేఖ రాయటం వల్ల పరిష్కారం ఉండదని జగన్‌కు తెలియదా అని అన్నారు రఘురామ.

Share.

Comments are closed.

%d bloggers like this: