విజయసాయి..ముందుగా నీ మొహం అద్దంలో చూసుకో-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ముందుగా నా కేసుల గురుంచి మాట్లాడే వారు మీ గురుంచి కాస్త ఆలోచించుకుని మాట్లాడలన్నారు. నాపై 2016లో కేసులు నమోదైతే, విజయసాయి, జగన్‌లపై 2011లోనే నమోదయ్యాయని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ఓటుకు నోటు కేసు గురించి నా సమాధానం కోర్టులకు చెబుతానని, ముందుగా మీ మొహాలు అద్దంలో చూసుకోవాలన్నారు. ఇక షర్మిల నాపై చేసే అనుచిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పారు. అందరితో పాటే నేను కూడా పార్టీ మారానని, నేను పార్టీకి చేస్తున్న సేవ చూసి మాత్రమే నాకు అధిష్ఠానం ఈ పదవిని అప్పజెప్పిందని తెలిపారు రేవంత్ రెడ్డి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: