మగధీరకు సీక్వల్‌ రానుందా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో మగధీర మూవీ సృష్టించిన రికార్డ్ చెరిగిపోనిదిగా మిగిలిపోయింది. ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్‌ రేంజ్‌ ఎల్లలు దాటిందనే చెప్పాలి. చరిత్రలో దాగిన ప్రేమ కథలను వెతికపట్టి రాజుల కాలం నాటి పరిస్థితుల మధ్య జోడించిన అద్భుతమైన ప్రేమ కథగా చిత్రీకరించారు దర్శకధీరుడు రాజమౌళి.

ఇందులో హీరోగా నటించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో రాజుల కాలం నాటి రాజ్యాల్లో ప్రేమకున్న విలువలను చూపించారు మన జక్కన్న. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. దీంతో పాటు హీరోగా ఓ రేంజ్‌ నటను చూపించి అగ్రహీరోల సరసన నిలబడ్డారు రామ్ చరణ్‌. ఇక తన నట విశ్వరూపాన్ని చూపించి మంచి మార్కులే ఎగరేసుకుపోయాడు చరణ్‌.

ఇక దీని తర్వాత అనేక సినిమాల్లో నటించిన చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. ఇక విషయానికొస్తే మగధీరకు సిక్వెల్‌గా సినిమా చేయాలని ఎప్పుటి నుంచో వస్తున్నవాదన. ఇక వాటికి ఫులి స్టాప్ పెడుతూ దీనికి సిక్వెల్ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. దీని గురించి చరణ్‌, రాజమౌళి ఇద్దరు కూడా చర్చించుకున్నారట.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనంతరం మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈలోగా చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత రెండు మూడు సినిమాలు చేయనున్నాడు. వీరిద్దరూ అనుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే మగధీర సీక్వెల్‌గా చేయనున్నారని తెలుస్తోంది. మరి ఇంతకు మగధీరకు సీక్వెల్‌గా వస్తుందా రాదా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు ఆగాక తప్పదు.

Share.

Comments are closed.

%d bloggers like this: