కత్తి మహేష్‌కు సీఎం జగన్ ఆర్థిక సాయం

Google+ Pinterest LinkedIn Tumblr +

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం చెన్నై ఆస్పత్రిలో ఉన్నాడు కత్తి మహేష్‌. రోడ్డు ప్రమాదంలో తన కంటికి, ముక్కుకి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైకి తరలించారు.

ఇక కత్తి మహేష్‌ కోలుకోవాలని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. ఇక ఆయన ప్రస్తుత పరిస్థితి తన స్నేహితులు, కుటుంబసభ్యులు చూసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కత్తి మహేష్‌కు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.17 లక్షల సాయం అందించారు. గతంలో కత్తి మహేష్‌ వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: