కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ రేణుక చౌదరి

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి. ఇక రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఖమ్మం జిల్లా నుంచే దండయాత్ర ప్రారంభమవుందని అన్నారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ ఆ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉందని అన్నారు.

ఢిల్లీలో ఆరు నెలల నుంచి రైతులు దీక్ష చూస్తుంటే సీఎం కేసీఆర్ స్పందించి రైతులకు ఏం సమాధానం చెప్పారని అన్నారు. ఇక ప్రధాని మోడీ ఆడవాళ్ల కన్నీరు తుడిచి పన్నీరు పోస్తానన్న ఆయన నేడు గ్యాస్ సిలిండర్ల ధరలను అమాంతంగా పెంచారన్నారు. చైనా గడప తొక్కుతుంటే ప్రధానికి సమాధానం లేదని అన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీయే తప్పా..ఇంకేం లేదన్నారు రేణుక చౌదరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: