షర్మిల పార్టీకి వ్యూహకర్తగా పీకే శిష్యురాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో రాజన్నరాజ్యం తీసుకొస్తానంటూ అడుగు పెట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలుచేస్తూ దూసుకుపోతోంది. తెలంగాణ సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇక పార్టీ ప్రకటనను ఈ నెల8న ప్రకటించనుంది షర్మిల.

ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో దూసుకెళ్తోంది వైఎస్ కూతురు. దీంతో పాటు పార్టీకి మంచి వ్యూహకర్తను రెడీ చేసుకునేందు తెర వెనుక మంతనాలు కూడా చేస్తోందట. తన వ్యూహాలతో ప్రత్యర్ధుల పార్టీలకు చుక్కలు చూపిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాలను అందించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ టీమ్‌ నుంచే ప్రశాంత్ శిష్యురాలైన ప్రియా అనే వ్యూహకర్తనుషర్మిల ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 8న ఆమెను అందరికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: