మోడీ గడ్డంపై ఎంపీ శశిథరూర్ సెటైర్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మోడీ గడ్డంపై సెటైర్లు విసిరారు. సోషల్ మీడియలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆయన ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు చమత్కరాలు జోడిస్తూ రిప్లై ఇచ్చాడు. ట్విట్టర్‌లో ఓ నెటిజన్ మీ నుంచి ఓ కొత్త పదాన్ని నేర్చుకోవాలనుకుంటున్నానని అడిగాడు. వెంటనే శశిథరూర్ ట్విట్టర్‌లో సమాధానమిస్తూ పొగ‌నోట్రొఫీ అనే పదాన్ని కొత్తగా నేర్చుకున్నానని, దీని అర్థం గడ్డం పెంచటం అని తెలిపాడు. ఈ సమాధానం మోడీ గడ్డాన్ని ఉద్దేశిస్తూ ఆయన రిప్లై ఇచ్చాడంటూ నెటిజన్లు ట్విట్లు చేస్తున్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలుపొందటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: