నేను అలా కాదంటున్న సింగర్ చిన్మయి

Google+ Pinterest LinkedIn Tumblr +

సింగర్ చిన్మయిపై ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ రకమైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె గర్భవతి అయిందని, తల్లికాబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వార్తలపై స్పందిస్తూ సమాధానమిచ్చింది ఈ ప్లే బ్యాక్ సింగర్. నాపై అసత్య ఆరోపణలు లేవనెత్తొద్దంటూ తెలిపింది.

నేను గర్భవతిని కాలేదని, అయినా నా వ్యక్తిగతమైన విషయాలు మీతో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయమంటూ తెలిపింది. ఒకవేళ మాకు పుట్టే పిల్లలను మాత్రం సోషల్ మీడియాతో పంచుకోమంటూ తెలిపింది. ఇక టాలీవుడ్‌లనే కాకుండా అన్ని భాషల్లో సింగర్‌గా రాణిస్తోంది ఈ స్టార్ సింగర్ చిన్మయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: