గాంధీలో కనిపించని కరోనా తగ్గుదల కేసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ గాంధీ ఆస్పత్రిలో పరిస్థతులు మాత్రం వైద్యులను కలవరపెడుతున్నాయి. కోవిడ్ కేసులు రోజుకు తగ్గినట్టే కనిపిస్తున్నా గాంధీలో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక గాంధీలో ప్రస్తుతం 642 కోవిడ్ కేసులు ఉండగా వీటితో పాటు బ్లాక్ ఫంగస్ సోకినవారు 150 మంది ఉన్నారు.

ఆస్పత్రిలో ప్రస్తుతం 492 కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటుండగా రోజుకు 60 మంది రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కల్లో మాత్రం రోజుకు రోజు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం విశేషం. కరోనా కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: