ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్‌ ధామి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరఖాండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్‌ ధామిను ఎన్నుకున్నారు ఆ రాష్ట్ర పార్టీ నేతలు. తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి నిన్న రాజీనామా చేయటంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నేడు జరిగిన ఉత్తరఖాండ్ శాసనసభపక్ష సమావేశంలో నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేశారు పార్టీ నేతలు.

ఇక నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆరు నెలల్లో ఏదైన శాసన సభ నుంచి ఎన్నిక కావాలి. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉండకపోవటంతో తీరత్ సింగ్ రాజీనామా చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: