పాలన పక్కనబెట్టి రాజకీయ అస్థిరతను సృష్టిస్తారా?-హరీశ్ రావత్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరాఖండ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు కరోనా, మరోవైపు రాజ్యాంగ నిబంధనల మధ్యలో నలిగిపోయారు తీరత్ సింగ్ రావత్. అనుకోని పరిస్థితుల మధ్య సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి దాపరించింది. ఈ నేపథ్యంలో నేడు నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్‌ ధామిని ఎన్నుకుంది ఆ పార్టీ అధిష్ఠానం.

వీటిన్నటిపై స్పందించారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ పాలన కొనసాగిస్తామని మోడీ హామీ ఇచ్చారని అన్నారు. హామీ అమలు కాలేదు కానీ నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రం మారారని అన్నారు. రాష్ట్రంలో పాలనను పక్కనబెట్టి బీజేపీ రాజకీయ అస్థిరతను సృష్టిస్తున్నారని విమర్శించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: