కత్తి మహేష్‌కు చేసిన సాయాన్ని ఒప్పుకోం-సోము వీర్రాజు

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్‌కు కంటి, ముక్కు భాగంలో గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి మహేష్‌కి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.17 లక్షల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ఇదే అంశంపై రెండు రోజుల నుంచి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

తాజాగా  స్పందించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హైదరాబాద్‌లో ఖరీదైన కార్లలో తిరిగే కత్తి మహేష్‌కు ఇన్ని లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు సోమువీర్రాజు. కరోనాతో రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకోకుండా తమకు కావాల్సిన వాళ్లకు సాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక అర్హులైన వాళ్లకి కాకుండా లగ్జరీగా తిరిగే వాళ్లకు ఇవ్వడాన్ని మేము ఒప్పుకోమంటూ తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: