కేసీఆర్ నీళ్లల్లో నిప్పులు రాజేస్తున్నారు-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

కృష్ణా బోర్డు మీటింగ్‌కు వెళ్లకుండా కేసీఆర్ నీళ్లల్లో నిప్పులు రాజేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి అన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ బహిరంగంగానే మద్దతు తెలుపుతూ లోలోపల స్నేహాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.

కృష్ణా నీటిని జగన్ మోహన్ రెడ్డి తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 9న కృష్ణా బోర్డు సమావేశానికి రానని చెప్పటం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. కృష్ణా నీటి జలాలకన్నా కేసీఆర్‌కు అంతకన్న ముఖ్యమైన పనేముందని అన్నారు. ఇక తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే కృష్ణా నీటిపై నోరు విప్పటం లేదని అన్నారు రేవంత్ రెడ్డి. జగన్ కుటుంబ పెద్దనే కేసీఆరే అని అన్నారు. ఇక షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నాడని అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: