సబితా ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు విద్యార్థులు. త్వరలో జరగనున్న డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ పక్రియ జరిపిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

దీనిపై మంత్రి సబితా జోక్యం చేసుకుని విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలపై విద్యాశాఖ అప్పటికే నిర్ణయం తీసుకుందని, ఇప్పటికిప్పుడు ఏం చేయలేమని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించే పరిక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇక పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి.

Share.

Comments are closed.

%d bloggers like this: