జూలై 8న షర్మిల పార్టీ ప్రకటన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ దూసుకోళ్తోంది వైఎస్ షర్మిల. పార్టీ ప్రకటనపై ఊరిస్తున్న షర్మిల ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల పార్టీ ప్రకటన చేయనుందని అధికారికంగా తెలిపింది.

ఇక వైఎస్సార్ తెలంగాణ అనే పేరుతో పార్టీని స్థాపించనున్నారు షర్మిల. జూలై 8న ముందుగా ఇడుపులపాయ చేరుకుని అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఇక దీనిపై ఇప్పటికే కార్యచరణ పూర్తి చేశారు షర్మిల.

Share.

Comments are closed.

%d bloggers like this: