అధిర్ రంజన్ చౌధురికి షాక్‌..లోక్‌సభ పక్షనేతగా శశి థరూర్‌?

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేతగా కొత్త వ్యక్తిని ఎన్నుకునేందుకు తెర వెనుక మంతనాలు జరుపుతోంది సోనియా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ పక్షనేతగా ఉన్నారు సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి. ఆయన బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం విశేషం.

ఇటీవల బెంగాల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగ ఓడిపోయింది. దీంతో లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఆయనకు చెక్‌ పెట్టేందుకు పార్టీ సిద్దమైందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇక రేసులో ఉన్న శశి థరూర్‌ ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయన రికార్డులు తిరగరాస్తున్నారు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నశశి థరూర్‌పై పార్టీ అగ్రనాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయనతో పాటు మరో సీనియర్ నేత మనీశ్ తివారీని పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరిపై మెగ్గుచూపుతుందో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: