పరీక్షలపై ఇప్పుడేం చేయలేం-తెలంగాణ హైకోర్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని కోరుతున్నారు. తాజాగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయటంతో దీనికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పరీక్షలు మొదలయ్యాయని, ఇప్పుడు వస్తే మేము ఏం చేయలేమని తెలిపింది. ఇక ఈ రోజు ఉదయం విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటిని ముట్టడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: