ప్రభాస్‌తో కాజల్ మరోసారి రోమాన్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటే ఫాన్స్‌కు ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలకు ఓ సినిమా చేసినా.. ఈ గ్యాప్‌కు సరిపడా ఇమేజ్‌ను సంపాదించుకుంటున్నాడు.

ఇక డార్లింగ్, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ వంటి చిత్రాల్లో కలిసి రోమాన్స్ చేసిన ప్రభాస్, కాజల్ మరోసారి కలిసి నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో కాజల్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుందని టాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఎంత అనేది తెలియాలంటే మరి కొన్ని రోజుల ఆగాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: