రామోజీరావుని కలిసిన రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ టీపీసీసీగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి వరుస పర్యటనలు చేస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఇక నిన్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ నేత డీకే శివకుమార్‌, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిశారు. ఇక రేపు టీపీసీసీగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకున్నారు.

దీంతో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మార్యదపూర్వకంగా కలిశారు. ఈయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన కలవనున్నారు. ఇక తాజాగా ఈ భేటీలో రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు మల్ రెడ్డి రంగారెడ్డి, మల్ రెడ్డి రాం రెడ్డి, చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇందులో భాగంగా రేపు టీపీసీసీగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండటంతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారట.

Share.

Comments are closed.

%d bloggers like this: