కేసీఆర్‌పై మండిపడ్డ బండి సంజయ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు బండి సంజయ్. 575 టీఎంసీల నీరు రావాల్సిన తెలంగాణకు 299 టీఎంసీల నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. గతంలో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు తెలియదా అంటూ ద్వజమెత్తారు. ఈ నీటి ఒప్పందాలపై అప్పట్లో చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకాలు పెట్టింది వాస్తవమా? కాదా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.

ఇక అప్పట్లో విద్యాసాగర్‌, నీటిపారుదలశాఖ మంత్రి కూడా సంతకాలు పెట్టారని అన్నారు. మీరు ఆ ఒప్పందాన్ని ఒప్పుకోవటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఒప్పుకున్నావని కేసీఆర్‌ను విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రోజక్క రొయ్యల దావత్‌కు పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ఒప్పుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు. ఆంధ్రనాయకులు నీళ్లు దోచుకెళుతుంటే నోరు విప్పలేదని కేసీఆర్‌పై ద్వజమెత్తారు బండిసంజయ్.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: