తెలంగాణ ఐటీ మంత్రిని కలిసిన సోనూసూద్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు ప్రముఖ నటుడు సోనూసూద్. నేడు ప్రగతి భవన్‌లో భటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ముందుగా కేటీఆర్‌ సోనూసూద్‌ను శాలువతో సత్కరించి, జ్ణాపికను అందజేశారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల వికేంద్రీకరణ వంటి అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో పేదలకు సాయం చేయటంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా సోనూసూద్ పేరు మారు మోగింది. దీంతో ఆక్సిజన్‌ ప్లాంట్లు, బెడ్లు వంటి మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఎన్నో సేవలను కొనసాగిస్తుండటంతో ఆయనను అభినవ దేవునిగా ప్రజలు కొనియాడుతున్నారు. ఈ సమావేశంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: