రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగారు తప్పా తగ్గలేదు-ఉత్తమ్

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఇంత నిరుద్యోగిత ఎప్పుడు లేదని అన్నారు మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నిరుద్యోగిత రేటు రెట్టింపు అయ్యిందే తప్పా తగ్గింది లేదని అన్నారు. ఇక రానున్న పార్లమెంట్‌ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న నీటి వివాదం, నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా తెలియజేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌తో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతా రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: