తెలుగు బిగ్‌బాస్‌లోకి అలీ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇందులో కంటెస్టెంట్స్ నడిపే లవ్ ట్రాక్స్ వంటివి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ షోలో కరోనా కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సీజన్‌-5 మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

దీంతో సీజన్‌-5కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విషయానికొస్తే ఈ సీజన్‌లో ఎవ్వరు కూడా ఉహించని వ్యక్తి ఇందులోకి ప్రవేశిస్తున్నాడు. అవును.. మీరు విన్నది నిజమే. టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు అలీ ఈ సీజన్‌లో మెరవనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: