త్వరలో భారత్‌లోకి స్పూత్నిక్-వీ వ్యాక్సిన్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతూ వస్తుంది. కరోనా మొదలైన నాటి నుంచి ప్రపంచ దేశాలు మందు కోసం తలమునకలయ్యాయి. మందు ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ మానవాళి ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ తరుణంలోనే కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ వంటి అత్యాధునిక వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

దీంతో ఇప్పుడు అన్ని రాష్ట్రలకు ఈ రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా మరో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రష్యా తయారు చేసిన స్పూత్నిక్-వీ వ్యాక్సిన్‌ త్వరలో ఇండియాకు రానుందని సమాచారం. దీంతో ఇండియా ప్రభుత్వం దీనిని దిగుమతి చేసుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా సరఫరా చేయనుందని తెలుస్తోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: