కంభంపాటి హరిబాబుకు పవన్ శుభాకాంక్షలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ నియామకంలో భాగంగా మిజోరం గవర్నర్‌గా నియామకమయ్యారు ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంభంపాటి హరిబాబుకు శూభాకాంక్షలు తెలిపారు. ఆచార్యుడిగా, విద్యావేత్తగా, ఎమ్మెల్యే, ఎంపీగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని పవన్ కొనియాడారు. ఇక వీరి సేవలు మిజోరం ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతుందని అయన అన్నారు. దీంతో వారికి నా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు పవన్ కళ్యాణ్‌.

Share.

Comments are closed.

%d bloggers like this: