కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన రమేష్‌ ఫోఖ్రి యాల్

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు రమేష్‌ ఫోఖ్రి యాల్. కేంద్రవిద్యా శాఖమంత్రిగా ఉన్న ఆయన బుధవారం ఉదయం ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయనతో పాటు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ గంగ్వార్ కూడా రాజీనామా చేశారు.

ఏ క్షణమైన మంత్రి వర్గవిస్తరణపై కొత్తవారి పేర్లతో కూడిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ దిశగా మోడీ సర్కార్ ఎన్నో రోజుల నుంచి నాన్చుతున్న మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు నేడు లేదా రేపు ప్రకటన వచ్చే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవారిని 20 మందికి పైగా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించవచ్చని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: