ఏపీలో అగస్టు 16న విద్యాసంస్థల ఓపెన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో రోజువారిగా నమోదవుతున్న కేసులను పరిశీలించినట్లైతే క్రమంగా రికవరీ రేటు కూడా పెరుగుతుండటం ఉపషమనంగా చూడవచ్చు. దీంతో ఇటీవల ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌లో భారీగా సడలింపులు ఇస్తు జగన్ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లను కూడా తెరుచుకునేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు.

ఇక కరోనాతో ఎన్నో నెలలుగా స్కూళ్లకు మూతపడటంతో మళ్లీ తెరిచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ నెల 12 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా దీంతో పాటు త్వరలో స్కూళ్లను తేరవాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇక అగస్టు 16 నుంచి ఏపీలో విద్యాసంస్థలు ఓపెన్ చేయనుండటంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: