మా కార్యకర్తలే పీకేలు..ఏకే-47లు-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ టీపీసీసీగా ప్రమాణస్వీకారం చేశారు. ఎంతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు.. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, సీతక్క వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నాలుగు కోట్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఎన్నో ఉద్యమాల కారణంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు మోసపోయారన్నారు. తెలంగాణ కోసం ఎంతో మహామహులు ఉద్యమాలు చేసి మరణించారని తెలిపారు. దీంతో రానున్న ఎన్నికల్లో మనకు ఏ ప్రశాంత్‌ కుమార్‌లు, ఏ పీకేలు ఎవరూ అవసరం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలే పీకేలు, ఏకే -47లని అన్నారు. ఇక ఆనాడు తెలంగాణ కోసం గొంతెత్తని నేతలు ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో పదవులు అనుభవిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: