బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరణించారు. ప్లూరల్ ఎఫ్యూషన్ అనే సమస్యతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌ సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. 1922 డిసెంబర్‌ 11న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిలీప్‌ కుమార్‌ జన్మించారు.

అడపాదడపా పనులు చేసుకుంటూ చివరికి ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టాడు. దీంతో సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా ఏనిమిది సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు దిలీప్ కుమార్. దీంతో పాటు 1994లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును కూడా ఆయన అందుకోవటం విశేషం. ఇక ఆయన సినిమా రంగానికి అనేక సేవలు చేయటంతో పద్మ అవార్డులు ఆయన దరిచేరాయి. 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: