కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తణలో భాగంగా కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి వరించనుందా?..ఇప్పుడు ఇదే వార్త తెలుగు రాజకీయాల్లో మారుమోగుతోంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్రహెంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక రేపో మాపో వెలువడనున్న కొత్తమంత్రివర్గ ప్రకటనలో కిషన్ రెడ్డి పేరు ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే గనుక నిజమైతే కిషన్ రెడ్డి రాజకీయంగా ఓ మెట్టు ఎక్కినట్టే అని చెప్పాలి. తెలంగాణ బీజేపీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా తెలంగాణ బీజేపీలో తనదైన ముద్రవేశారు. తెలంగాణ అనుభవం ఉన్న సీనియర్ నేతగా ఆయన పార్టీలో ఉన్నారు. ఇక ఎన్నో రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తోంది మోడీ సర్కార్. దీంతో కొత్త వారికి కూడా ఈ విస్తరణలో పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇంతకు కిషన్ రెడ్డికి పూర్తి స్థాయి కేంద్రమంత్రి పదవి వరిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మరో రెండు రోజుల్లో తెలనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: